‘మత్తు’ రహిత జిల్లాగా మార్చుదాం
సాక్షి, సిద్దిపేట: మత్త రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుదాం. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా.. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. 2024లో రోడ్డు ప్రమాదాలు కొంత మేర పెరిగాయి. కొత్త ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు తగ్గేలా ప్రత్యేక దృష్టి సారించి, చర్యలు తీసుకుంటాం. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సైబర్ నేరాలు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటాం. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలి. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – డాక్టర్ అనురాధ, సీపీ
Comments
Please login to add a commentAdd a comment