డీఐఈఓ ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఏం చదువుతున్నారు? అధ్యాపకులు సరిగా పాఠాలు చెబుతున్నారా? అని వారిని ప్రశ్నించారు. అనంతరం కళాశాల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు.
గురువులు
సమాజ మార్గదర్శకులు
ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఉపాధ్యాయులేనని.. గురువులు సమాజ మార్గదర్శకులని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చంద్లాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోడూరు సుధాకర్ ఉద్యోగ విరమణ సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుధాకర్ లాంటి నిబద్దత గల ఉపాధ్యాయులను చూస్తే విద్యార్థులు ఎంతో ప్రేమిస్తారన్నారు. విద్యార్థులు ఇంట్లో కన్నా పాఠశాలలో ఎక్కువ సమయం గడుపపుతారని, తద్వారా గురువుతో అనుబంధం పెరుగుతుందన్నారు. ఉద్యోగులకు బదిలీలు, విరమణ సహజమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎంఈఓలు యాదవరెడ్డి, దేశిరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం సత్తయ్య, జిల్లా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతకుముందు సుధాకర్ దంపతులను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment