పూలను అందిస్తూ వినూత్న నిరసన
సిద్దిపేటరూరల్: సమగ్ర శిక్షా ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. మంగళవారం నాటికి 22 రోజుకు చేరింది. ఈ క్రమంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్, జిల్లా అధికారులకు పూలను అందిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 రోజులుగా నిరసన చేపడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేసి పేస్కేల్ అందించాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్, కార్యదర్శి నవీన్, రాష్ట్ర కమిటీ నాయకులు కష్ణవేణి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
22వ రోజుకు చేరిన
సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె
Comments
Please login to add a commentAdd a comment