మల్లన్న బండ ఆలయ అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): మల్లన్న బండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి–జంగపల్లి శివారులో వెలసిన మల్లన్న బండ ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. మలన్న దేవుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా ఏర్పడిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి యేటా సంక్రాంతి పర్వదినాన మల్లన్న బండపై జరిగే మహా జాతరకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. జిల్లాలో కొమురవెల్లి, కూడవెల్లి జాతర తర్వాత అత్యంత పెద్ద జాతరగా పేరుగాంచిన మల్లన్న బండ జాతర ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో మల్లన్న బండ ఆలయ కమిటీ నూతన చైర్మన్ లింగాల వెంకట్‌రెడ్డి, వీరారెడిపల్లి, జంగపల్లి మాజీ సర్పంచులు కొమ్మాట బాలకృష్ణ, కంచం యాదగిరి, ఆలయ వైదిక నిర్వాహకులు జంగం కొమురయ్య, బీఆర్‌ఎస్ జిల్లా సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, జీడిపల్లి రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment