కొండపాక(గజ్వేల్): ప్రమాదవ శాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంప్‌లో పడి ఒకరు మృతి చెందారు. కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుకునూరుపల్లి మండలం మేదినీపూర్‌కు చెందిన బూరుగు మల్లేశం (38) శనివారం రాత్రి సంప్‌లోంచి నీళ్లను బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి భార్య సుమలత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment