అక్రమ కేసు ఉపసంహరించుకోండి
కొండపాక(గజ్వేల్): కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రవీందర్ డిమాండ్ చేశారు. కుకునూరుపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజా పాలనను పక్కన బెట్టి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంత్యంత సుందరీకృతంగా తీర్చిదిద్దిన బీఆర్‌ఎస్ నేతల్లో కేటీఆర్ ఒకరన్నారు. 2023లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక నగరాలను కాదని ఈ ఫార్ములా రేస్ కోసం హైదరాబాద్ ఎంపిక కావడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వం రుణమాఫీ, పెట్టుబడి సాయం హామీలను పక్కన బెట్టడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ప్రభుత్వ పాలన మాటలకే పరిమతమైందన్న విషయాన్ని ప్రజానీకం గుర్తించిందన్నారు. సీఎం వ్యవహార తీరును ప్రశ్నించినందుకు తప్పుడు కేసును పెట్టడం సరికాదన్నారు. కేసు ఉపసంహరించుకునే వరకు ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు బచ్చలి మహిపాల్, పుల్లోజు కిరణ్‌కుమార్‌చారి, నాయకులు రమేశ్‌గౌడ్, కృష్ణ, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రవీందర్
Comments
Please login to add a commentAdd a comment