నాట్యంతో ఆకట్టుకున్న చిన్నారి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆంధ్ర శ్రీశైలంలో జరిగిన నాట్య ప్రదర్శనలో సిద్దిపేటకు చెందిన నృత్యకారిణి దార ప్రీతిక ఆకట్టుకున్నట్లు శుక్రవారం హిమగిరి అకాడమీ నిర్వాహకురాలు సృజన తెలిపారు. శ్రీశైలంలోని భ్రమరాంభిక మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో సిద్దిపేట నృత్య కళాకారులు రాణించారన్నారు. కళాకారిణికి ఆలయ నిర్వాహకులు ప్రశాంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందించినట్లు తెలిపారు.
‘సీఎం కప్’లో విద్యార్థుల సత్తా
సిద్దిపేట ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సిద్దిపేట విద్యార్థినులు సీఎం కప్‌లో సత్తాచాటారు. సిద్దిపేటలో నిర్వహించిన పోటీల్లో పలు విభాగాల్లో మెడల్స్ సాధించి కళాశాల ప్రతిష్ట పెంచారు. ఈ మేరకు శుక్రవారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జీవన్‌కుమార్‌తో పాటుగా అధ్యాపకులు అభినందించారు. అండర్ 20 మహిళా విభాగంలో 200 మీటర్ల పరుగు పందెంలో మహాలక్ష్మి ప్రథమ స్థానం, శ్రీలత ద్వితీయ స్థానం, 400 మీటర్ల విభాగంలో మమత ద్వితీయ స్థానం, మహాలక్ష్మి తృతీయ స్థానం, 800 మీటర్ల పరుగు పందెంలో మమత తృతీయ స్థానం, లాంగ్ జంప్‌లో రేవన్య ప్రథమ, వైష్ణవి ద్వితీయ స్థానం సాధించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment