నాగుబాయికి దిక్కెవరు?
గజ్వేల్‌రూరల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు కోసం సహకరించి సొంత ఇళ్లను కోల్పోయారు. గత ప్రభుత్వం వీరికి డబుల్‌బెడ్రూం ఇళ్లను ఇస్తామని హామీనిచ్చింది. నేటికీ నెరవేరలేదు. అద్దె ఇళ్లలోనే మగ్గుతున్నారు. విషయానికి వస్తే.. పట్టణానికి చెందిన నాగుబాయి మున్సిపల్ అభివృద్ధి రోడ్డు వెడల్పులో సొంతింటిని కోల్పోయింది. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇస్తుందనే ఆశతో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం గడుపుతోంది. ఇటీవల అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందజేశారు. అనంతరం వైద్యులు ఇంటికి డిశ్చార్జి చేశారు. కిరాయి ఇంటికి చేరుకోగా యజమాని అనుమతించలేదు. చేసేది లేక తమ పాత ఇంటి స్థలంలో రోడ్డుపైన మంచం ఏర్పాటు చేశారు. సమీప బంధువులు తమ పాత ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఏది ఏమైనా ఆమెకు డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని కేటాయించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment