మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ రెండో విజయం నమోదు చేసింది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో వికెట్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయంలో ఆల్‌రౌండర్ స్కివర్ 61 పరుగులతో కీలక పాత్ర పోషించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆదిలోనే ఓపెనర్ డేనియల్ వ్యాట్ వికెట్‌ను కోల్పోయింది.
అయితే రెండో వికెట్‌కు బ్యూమాంట్, కెప్టెన్ హీథర్ నైట్ కలిసి 36 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వరుస క్రమంలో ఇంగ్లండ్ వికెట్‌లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే అఖరిలో ఇంగ్లండ్ వరుస క్రమంలో నాలుగు వికెట్లు కోల్పోడంతో మ్యాచ్ న్యూజిలాండ్ వైపు మలుపు తిరిగింది. దీంతో న్యూజిలాండ్ విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచింది.
ఈ సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ అన్య ష్రూబ్సోలీ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫ్రాన్సిస్ మాకే నాలుగు వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్ రెండు వికెట్లు సాధించింది. కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 203 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డివైన్(41), మాడీ గ్రీన్(52) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రాస్, ఎక్లెస్టోన్ చెరో మూడు వికెట్లు సాధించారు. ఇక వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు సెమీస్‌కు చేరే అవకాశాలు దాదాపు గల్లంతు అయ్యాయి.
చదవండి: IPL 2022: 'కేకేఆర్ నాకు లక్కీ టీమ్.. ఈ సారి ఐపీఎల్ కప్ మాదే'
Comments
Please login to add a commentAdd a comment