హర్వంశ్‌ వీరోచిత సెంచరీ.. 492 పరుగులకు భారత్‌ ఆలౌట్‌ | Harvansh's century powers India U-19 to 492 on Day 2 | Sakshi
Sakshi News home page

హర్వంశ్‌ వీరోచిత సెంచరీ.. 492 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

Published Wed, Oct 9 2024 10:36 AM | Last Updated on Wed, Oct 9 2024 10:55 AM

Harvansh's century powers India U-19 to 492 on Day 2

యువ భారత బ్యాటర్‌ హర్వంశ్‌ సింగ్‌ పంగాలియా (143 బంతుల్లో 117; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ‘శత’క్కొట్టడంతో రెండో యూత్‌ టెస్టులో భారత అండర్‌–19 జట్టు భారీస్కోరు చేసింది. ఆ్రస్టేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133.3 ఓవర్లలో 492 పరుగుల వద్ద ఆలౌటైంది. 

సౌరాష్ట్ర వికెట్‌ కీపర్, బ్యాటర్‌ హర్వంశ్‌ వీరోచిత సెంచరీతో అదరగొట్టాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 316/5తో మంగళవారం ఆట కొనసాగించిన భారత జట్టు ఆరంభంలోనే క్రితం రోజు బ్యాటర్‌ కెపె్టన్‌ సోహమ్‌ పట్వర్ధన్‌ (63; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు కేవలం 2 పరుగులు మాత్రమే జోడించి అతను పెవిలియన్‌ చేరుకున్నాడు.

 ఈ దశలో హర్వంశ్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లతో కలిసి జట్టును నడిపించాడు. మొహమ్మద్‌ ఇనాన్‌ (26; 4 ఫోర్లు) చక్కని సహకారం అందించడంతో ఏడో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు. ఇనాన్‌ అవుటయ్యాక క్రీజులోకి వచి్చన సమర్థ్‌ నాగరాజ్‌ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి జట్టు స్కోరును 400 పైచిలుకు చేర్చాడు. అయితే కాసేపటికే సమర్థ్‌తో పాటు చేతన్‌ శర్మ (0)ను లచ్లాన్‌ రనాల్డో ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చడంతో 402 పరుగులకే భారత్‌ 9 వికెట్లను కోల్పోయింది. 

ఇక ఆలౌట్‌ లాంఛనమే అనుకున్న దశలో ఆఖరి వరుస బ్యాటర్‌ అన్‌మోల్‌జీత్‌ సింగ్‌ (50 బంతుల్లో 11 నాటౌట్‌; 1 ఫోర్‌) క్రీజులో మొండిగా నిలువడంతో హర్వంశ్‌ పరుగుల్ని చక్కబెట్టాడు. ఈ క్రమంలో అతను సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పదో వికెట్‌కు ఏకంగా 90 పరుగులు జోడించాక హర్వంశ్‌ను కింగ్సెల్‌ పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆసీస్‌ అండర్‌–19 జట్టులో ఏకంగా తొమ్మిది మంది బౌలింగ్‌కు దిగడం గమనార్హం.

 ఇందులో ఓలీ పాటర్సన్, హ్యారీ, క్రిస్టియాన్‌ హోవ్, రనాల్డో తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆ్రస్టేలియా జట్టు ఆట నిలిచే సమయానికి 44 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్లు రిలే కింగ్సెల్‌ (4), సైమన్‌ బడ్జ్‌ (5)లను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

అయితే వన్‌డౌన్‌ బ్యాటర్, కెప్టెన్‌ ఒలీవర్‌ పెక్‌ (61 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అలెక్స్‌ లీ (45 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) అబేధ్యమైన నాలుగో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించారు. మొహమ్మద్‌ ఎనాన్‌కు 2 వికెట్లు దక్కగా, అన్‌మోల్‌జీత్‌ ఒక వికెట్‌ తీశాడు.
చదవండి: IPL 2025 Mega Auction: మార్క్‌రమ్‌కు నో ఛాన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ ఇదే! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement