IPL 2022 DC VS PBKS: Delhi Capitals And Punjab Kings Head To Head Records, Details Inside - Sakshi
Sakshi News home page

IPL DC Vs PBKS Records: కరోనా కల్లోలం నడుమ ఢిల్లీ, పంజాబ్‌ వార్‌.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

Published Wed, Apr 20 2022 2:42 PM | Last Updated on Wed, Apr 20 2022 3:19 PM

IPL 2022: DC VS PBKS Head To Head Records - Sakshi

DC VS PBKS Head To Head Records: ఢిల్లీ క్యాపిటల్స్‌ క్యాంప్‌లో ఐదు కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాల మధ్య ఇవాళ (ఏప్రిల్‌ 20) ఢిల్లీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య వార్‌ జరుగనుంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభంకానుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ పుణేలో జరగాల్సి ఉండింది. అయితే డీసీ క్యాంప్‌లో కోవిడ్‌ కల్లోలం కారణంగా వేదిక ముంబైకి మారింది.

ప్రస్తుత సీజన్‌లో డీసీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, పంజాబ్‌ కింగ్స్‌ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 3 అపజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌లో ఢిల్లీ.. ఆర్సీబీ చేతిలో 16 పరుగుల తేడాతో ఓడగా, పంజాబ్.. సన్‌రైజర్స్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. 

గత రికార్డులను పరిశీలిస్తే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు 28 మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా, డీసీ 13, పంజాబ్‌ 15 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. గత 5 మ్యాచ్‌ల్లో డీసీ ఏకంగా నాలుగింటిలో గెలుపొంది పంజాబ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక, నేటి మ్యాచ్‌కు ఢిల్లీ ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కోవిడ్‌ బారిన పడి ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన మిచెల్‌ మార్ష్‌ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

మరోవైపు పంజాబ్‌.. రెగ్యులర్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ లేకుండానే ఈ మ్యాచ్‌ కూడా ఆడనుంది. మయాంక్‌ స్థానంలో శిఖర్‌ ధవన్‌ పంజాబ్‌ను ముందుండి నడిపించనున్నాడు. పంజాబ్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. బలాబలాల పరంగా పంజాబ్‌తో పోలిస్తే ఢిల్లీ కాస్త బలంగానే కనిపిస్తున్నప్పటికీ, ఆ జట్టులోని ఆటగాళ్లు ఆశించిన మేర రాణించలేకపోతున్నారు. 

పంజాబ్‌ పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. ఢిల్లీ జట్టులో వార్నర్‌, పృథ్వీ షా, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ ఫామ్‌లో ఉండటాన్ని బట్టి చూస్తే, ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్‌ జట్టులో ఒక్క లివింగ్‌స్టోన్‌ మినహా ఎవ్వరూ నిలకడగా రాణించలేకపోతున్నారు. బెయిర్‌స్టో, ధవన్‌ తమ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. 

తుది జట్లు (అంచనా):
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్ 
చదవండి: డెవాన్‌ కాన్వే ప్రీ వెడ్డింగ్‌ పార్టీ.. పంచ కట్టుతో రచ్చరచ్చ చేసిన సీఎస్‌కే ప్లేయర్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement