Courtesy: IPL Twitter
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి పాలనలో పచ...
సాక్షి, కదిరి: కూటమి సర్కార్ పాలనలో అ...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి...
ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమమే �...
ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీత�...
విజయవాడ, సాక్షి: ఎన్డీయే కూటమి సర్కార...
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధ�...
ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉ�...
ఢిల్లీ: పార్లమెంట్లో ఆర్థిక మంత్రి �...
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్�...
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో బడ్జెట�...
ఫిరాయింపు రాజకీయాలపై కేరళ ఉన్నత న్యా...
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం క...
Published Sun, May 15 2022 7:05 PM | Last Updated on Sun, May 15 2022 11:31 PM
Courtesy: IPL Twitter
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ లైవ్ అప్డేట్స్
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్ , మెక్కాయ్,ప్రసిద్ధ్ కృష్ణ, చెరో రెండు వికెట్లు, అశ్విన్, చాహల్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పడిక్కల్ 39, శాంసన్ 32 పరుగులలో రాణించారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ రెండు, ఆవేష్ ఖాన్, హోల్డర్, బదోని ఒక వికెట్ సాధించారు.
లక్నో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఒబెడ్ మెక్కాయ్ వేసిన 17 ఓవర్లో హోల్డర్, చమీరా ఔటయ్యారు. లక్నో విజయానికి 18 బంతుల్లో 59 పరుగులు కావాలి.
116 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన దీపక్ హుడా.. చాహల్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.
94 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో దీపక్ హుడా(44),స్టోయినిస్ ఉన్నారు.
12 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి లక్నో 88 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా(22), దీపక్ హుడా(40) పరుగులతో ఉన్నారు.
9 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి లక్నో 61 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్ పాండ్యా(19), దీపక్ హుడా(17) పరుగులతో ఉన్నారు.
29 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రాహుల్.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోర్: 34/3
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో డికాక్, బదోని ఔటయ్యారు. 3 ఓవర్లకు 24/2
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పడిక్కల్ 39, శాంసన్ 32 పరుగులలో రాణించారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ రెండు, ఆవేష్ ఖాన్, హోల్డర్, బదోని ఒక వికెట్ సాధించారు.
ఒకే ఓవర్లో రాజస్తాన్ రెండు వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్ బిష్ణోయ్ వేసిన బిష్ణోయ్ బౌలింగ్‌లో పరాగ్,నీషమ్ పెవిలియన్‌కు చేరారు. 19 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 168/6
122 పరుగుల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన పడిక్కల్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 130/4
101 పరుగుల వద్ద రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన జైస్వాల్.. బదోని బౌలింగ్‌లో ఔటయ్యాడు.
11 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(24), జైస్వాల్(41) పరుగులతో ఉన్నారు.
75 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగుల చేసిన శాంసన్.. హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
6 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(34), శాంసన్(13) పరుగులతో ఉన్నారు.
11 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన బట్లర్.. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 3 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 15/1
బ్రబౌర్న్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్
రాజస్తాన్ రాయల్స్
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్కాయ్
Comments
Please login to add a commentAdd a comment