వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇక సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు శనివారం మౌంట్ మంగనూయ్‌లో అడుగుపెట్టింది.
ఇక మౌంట్ మంగనూయ్ చేరుకున్న టీమిండియాకు అక్కడి సాంప్రదాయ 'మావోరీ పౌహిరి' స్వాగతం లభించింది. మావోరీ స్వాగత వేడుకలో డ్యాన్స్, గానం, హాంగీ భాగంగా ఉంటాయి. ఇది సాధారణంగా అతిధులను ఆహ్వానించే సమయంలో ఊపయోగిస్తారు.
ఇందుకు సంబంధించిన వీడియోను టీమిండియా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండో టీ20కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. గత రెండు రోజులగా మౌంట్ మంగనూయ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చదవండి: FIFA WC 2022: ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు
Comments
Please login to add a commentAdd a comment