టీడీపీలో సోమిరెడ్డి కరివేపాకేనా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెన్నుపోటు రాజకీయాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కేరాఫ్ అనేది జగద్విదితమే. ఆ పార్టీ కోసం దశాబ్దాలుగా ఊడిగం చేసినా, చివరికి వారు కరివేపాలుగా మారుతున్నారు. తాజాగా ఆ జాబితాలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేరారనే చర్చ జరుగుతోంది. సర్వేపల్లిలో వరుస ఓటములతో ఇప్పటికే కుంగిపోతున్న ఆయనకు ఈ దఫా అధిష్టానం టికెట్ ఇచ్చే యోచనలో లేనట్లుగా ప్రచారం సాగుతోంది.
సోమిరెడ్డికి ఓటమి భయం
మాజీ మంత్రి సోమిరెడ్డికి 2004 ఎన్నికల నుంచి గ్రహబలంతో పాటు జనబలం అనుకూలంగా లేదు. దీంతో వరుసగా ఓటమి పాలవుతున్నాడు. సర్వేపల్లిలోనే 2004, 2009 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతిలో, 2014, 2019 ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2012లో కోవూరు ఉపఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చెందారు.
కొత్త వ్యక్తుల కోసం అన్వేషణ
సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓటమి మరోసారి ఖాయమన్న సంకేతం పార్టీ అధిష్టానానికి చేరింది. ఇప్పటికే ఆ పార్టీ నేత లోకేశ్ వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన వారి కి ఈ దఫా సీటు ఇవ్వమని చెప్పిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి ని తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే టీడీపీ తొలిజాబితాలో సర్వేపల్లి సీటు ప్రకటన చేయలేదనే ప్రచారం ఉంది. తాజాగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, లేదా పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేర్లతో ఐవీఆర్‌ఎస్ సర్వే చేయిస్తున్నారు. సర్వేపల్లి ని యోజకవర్గంలో టీడీపీనుంచి ఎవరు పోటీ చేసినా ఓట మి ఖాయమని సర్వేల్లో తేలడంతో కొత్త వ్యక్తులు కూ డా అక్కడ నుంచి పోటీ చేసేందుకు జంకుతున్నారు.
సోమిరెడ్డి భవితవ్యంపై నీలినీడలు
టీడీపీలో సీనియర్ నేతగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న సోమిరెడ్డి రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పార్టీలో సీనియర్ నేతగా ఉండి సీటు కోసం అధిష్టానం వద్ద చేతులు కట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సర్వేపల్లిలో సీటు ఇవ్వకుంటే తనకంటూ నియోజకవర్గం లేకుండా పోతుందని, తన కుమారుడి రాజకీయ ఆరంగేట్రం కుదిరేలా లేదని లోలోన మదన పడుతున్నట్లు పార్టీ నేతలే చెపుతున్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న నేతగా చెప్పుకునే సోమిరెడ్డి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంపై సొంత పార్టీలోనే చులకన అవుతున్నారు. నియోజకవర్గంలో కొందరు అమాయకులను పిలిపించుకుని పార్టీ కండువా కప్పుకుంటే చాలు ఇంత ప్యాకేజీ ఇస్తానంటూ బతిమాలుకోవడంపై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
కాకాణి సైటెర్లు..
ప్రస్తుతం సోమిరెడ్డి ప్రత్యర్థిగా ఉన్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలిపి శభాష్ అనిపించుకుంటున్నారు. సోమిరెడ్డి అవినీతి పాపాలను నిత్యం వల్లెవేస్తున్నారు. తాజాగా టీడీపీ తొలిజాబితాలో సోమిరెడ్డికి సీటు ఖరారు చేయకపోవడంపై మంత్రి స్పందించారు. సోమిరెడ్డే తనకు ప్రత్యర్థిగా ఉండాలని సీటు ఇవ్వకుంటే మేమే ధర్నా చేస్తామంటూ సైటెర్లు వేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి అయితేనే అవినీతి పాపాలను కడిగేసేందుకు బావుంటుందని మంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించారు.
ఉదయగిరి: ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొల్లినేని రామారావును కాదని, చంద్రబాబు ఈసారి కాకర్ల సురేష్‌కు టికెట్ ప్రకటించడంతో పార్టీలో ఆరంభమైన మంటలు మూడ్రోజులు గడిచినా ఇంకా చల్లారలేదు. రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతూ టీడీపీలో వేడి పుట్టిస్తోంది. టీడీపీ తొలి జాబితాలో కాకర్ల సురేష్ పేరు ప్రకటించడంతో బొల్లినేని రామారావు అధినేత చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ ‘ఉదయగిరిలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తాను’ అంటూ హెచ్చరించి పార్టీ పెద్దలకు టచ్‌లో లేకుండా వెళ్లిపోయారు. చంద్రబాబు ఎంత ప్రయత్నంచినా బొల్లినేని అందుబాబులోకి రాకపోవడంతో ఆయనను బుజ్జగించే ప్రయత్నం బీద రవిచంద్రకు అప్పగించారు. దీంతో ఆయన ఆదివారం హైదరాబాదులో ఉన్న బొల్లినేని నివాసానికి వెళ్లి మాట్లాడినా మెత్త బడలేదు. చంద్రబాబు నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లో అయినా పాల్గొనాలని బీద కోరినా బొల్లినేని తిరస్కరించారు. పార్టీకి ఎంతో సేవ చేసిన నాకు తీవ్ర అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. సోమవారం కూడా బొల్లినేనితో మాట్లాడేందుకు పలువురు టీడీపీ పెద్దలతో పాటు చంద్రబాబు ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన సోమవారం ముంబాయి వెళ్లిపోయారు.
రేపు బొల్లినేని కీలక సమావేశం
టికెట్టు విషయంలో బొల్లినేనికి జరిగిన అన్యాయంపై రగిలిపోతున్న ఆయన అనుచరులు పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు బొల్లినేనిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే పార్టీకి గుడ్‌బై చెప్పి తమ సత్తా ఏమిటో ఎన్నికల్లో చూపించాలని దృఢంగా ఉన్నారు. వైఎస్సార్‌పీపీ అవకాశం ఇస్తే పార్టీ మారాలని కూడా ఆయన అనుచరులు బొల్లినేనిపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయగిరిలో బుధవారం బొల్లినేని తన అనుచరులతో కీలక సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు బొల్లినేని అనుచరులు చెబుతున్నారు. అయితే బొల్లినేని పార్టీ నుంచి వెళ్లిపోకుండా బుజ్జగించే నిమిత్తం చంద్రబాబు కొంతమంది పార్టీ జిల్లా పెద్దలకు బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో మరో రెండ్రోజుల్లో స్పష్టం కానుంది.
తొలి జాబితాలో దక్కని చోటు
సర్వేపల్లికి ఇతరుల పేర్లు పరిశీలన
ఆనం, పెళ్లకూరు పేర్లతో ఐవీఆర్‌ఎస్ సర్వే
సోమిరెడ్డి రాజకీయ భవితవ్యంపై
నీలినీడలు
నేతల బుజ్జగింపు యత్నాలు విఫలం
రేపు ఉదయగిరిలో అనుచరులతో భేటీ
కలవరపడుతున్న టీడీపీ అధిష్టానం
Comments
Please login to add a commentAdd a comment