పక్కాగా ఆరోగ్య పెన్షన్ల పరిశీలన
నెల్లూరు (పొగతోట): వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన హెల్త్ పెన్షన్‌ల పరిశీలన పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో పెన్షన్ల పరిశీలనకు నియమించిన అధికారులు, డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,274 హెల్త్ పెన్షన్లు ప్రతినెలా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్ అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించి, అనంతరం అర్హులు, అనర్హుల వివరాలను అందచేయాలన్నారు. నగరంలోని ఏసీ నగర్, రామ్‌నగర్ సచివాలయాల పరిధిలో హెల్త్ పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారుల ఇళ్లకు పీడీ వెళ్లి పరిశీలించారు.
ప్రజా సేవే ముఖ్యం
● మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
నెల్లూరు రూరల్: పదవి ఉన్నా లేకపోయినా ప్రజా సేవ ముఖ్యమని, పదవులు రావడం పోవడం నుదిటి రాత అని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారనే ప్రచారాన్ని ఖండించారు. జీవితంలో ఏ పదవీ శాశ్వతం కాదని, మాజీ అనేది మాత్రమే శాశ్వతమని చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment