● కర్ణాటకలో రెండు కేసులు నమోదు
నెల్లూరు (అర్బన్): చైనా దేశంలో కల్లోలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యుమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. గుజరాత్‌లో ఒక కేసు, పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మరో రెండు కేసులు వెలుగు చూశాయి. వీటిని హెచ్‌ఎంపీవీగా ఐసీఎంఆర్ ధ్రువీకరించడంతో అప్రమత్తమైన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. నిర్లక్ష్యం వహిస్తే నిండుప్రాణాలు బలైపోతాయని హెచ్చరించింది. ఈ వైరస్ ప్రభావం కరోనా వలే వేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో నెల్లూరు జిల్లా ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.
చలికాలంలో సహజంగానే దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం కేసులు పెరుగుతున్నాయి. అలాంటి లక్షణాలతోనే హెచ్‌ఎంపీవీ సోకుతోంది. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి న్యూమోనియాగా, బ్రాంకై టిస్‌గా మారి ప్రాణాలను హరించివేసే అవకాశం ఉంది. అందువల్లనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికే..
ఈ వైరస్ ప్రధానంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా సంక్రమిస్తుంది. మూడు నుంచి ఆరు రోజుల లోపల దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో ఈ వ్యాధి వెలుగు చూస్తుంది. ముక్కు నుంచి స్రావాలు కారడం జరుగుతుంది. తుమ్ములు, దగ్గు, తుంపర్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలగడం, బాఽ దితులను తాకి ఆ చేతులతో ముక్కు, కళ్లు, నోటిని తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
● ప్రస్తుతానికి దేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు చిన్న పిల్లల్లోనే వెలుగు చూశాయి. వీరు అంతర్జాతీయంగా ప్రయాణం చేయలేదు. అయినా వీరికి చైనాలో వెలుగు చూసిన వైరస్ ఇక్కడ రావడం అంటే ఆ దేశాల నుంచి ప్రయాణించిన వారి ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జబ్బు వచ్చి ఉండవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు.
ఏం చేయాలంటే..
ఏదైనా వ్యాధి వస్తే తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ప్రధానంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష, పచ్చటి ఆకుకూరలు ఆహారంగా తీసుకోవాలి. వెల్లుల్లి, అల్లం ఉపయోగించాలి. డ్రై ఫ్రూట్స్ ఆహారంగా తీసుకోవాలి. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
జిల్లా వైద్యశాఖకు సూచనలు
హెచ్‌ఎంపీ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖాధికారులు జిల్లా వైద్యశాఖకు తగు సూచనలు చేశారు. దీంతో డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుజాత జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.
గుజరాత్‌లో మరో కేసు
పసిపిల్లలే బాధితులు
కరోనాను పోలిన వైరస్
ముందు జాగ్రత్త చర్యలే రక్ష
భయపడాల్సిన అవసరం లేదు
జిల్లాలో ప్రస్తుతానికి హెచ్‌ఎంపీ వైరస్ కేసులు లేవు. ఈ వైరస్ సోకినప్పటికీ భయపడాల్సిన పనిలేదు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేయకుండా సమీప డాక్టర్‌ను సంప్రదించి వైద్య సేవలు పొందాలి. వారం రోజుల్లో జబ్బు తగ్గిపోయే అవకాశం ఉంది. ఫ్లూ వైరస్ లాగానే ఈ వైరస్‌లో కూడా సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యశాఖ పక్షాన అప్రమత్తంగా ఉండి అవసరమైతే ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తాం.
– డాక్టర్ వి.సుజాత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి
Comments
Please login to add a commentAdd a comment