వెంకట శేషయ్యది అక్రమ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, వెంకటాచలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మందల వెంకటశేషయ్యపై తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వెంకటశేషయ్య సతీమణి రాజేశ్వరమ్మ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు వినతిపత్రం అందజేశారు. తప్పుడు కేసుకు సంబంధించిన ఆధారాలు ఏఎస్పీకి అందజేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటాచలం పోలీసులు శ్రావణి ఫిర్యాదు మేరకు వెంకట శేషయ్యపై కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా సరైన ఆధారాలు లేవని రిమాండ్ రిపోర్టును తిరస్కరించారన్నారు. అయితే ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెంకట శేషయ్యను వెంకటాచలంలోని శ్రావణి అత్తమామల ఇంటికి తీసుకెళ్లి, శ్రావణి మామ పెంచలయ్య రెండు రూ.50 విలువ కలిగిన, శ్రావణి సంతకంతో కూడిన ఖాళీ స్టాంపు పేపర్లను తనకు అందించాడని తప్పుడు స్వాధీనం మహాజరునామా తయారుచేసి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అక్కడికి రాకుండానే వచ్చినట్టు సంతకం చేసి మోసపూరితంగా తయారుచేసి కోర్టుకు సమర్పించారన్నారు. దాని ఆధారంగానే వెంకటశేషయ్య రిమాండ్‌కు వెళ్లారన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంకటాచలం ఇన్‌స్పెక్టర్ సుబ్బారావును అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రావణి అనే మహిళతో తప్పుడు ఫిర్యాదు చేయించి అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారన్నారు.
ఈ వ్యవహారంలో ఎవరినీ వదలం
తప్పుడు స్టాంపు పేపర్లు సృష్టించి, కోర్టును తప్పుదోవ పట్టించిన వారందరూ శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్య లు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటశేషయ్య ఘటనపై పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి
ఏఎస్పీకి వైఎస్సార్‌సీపీ నేతల వినతి
పక్కా ఆధారాలతో పోలీసులపై ప్రైవేట్ కేసు పెడతాం: కాకాణి
Comments
Please login to add a commentAdd a comment