నెల్లూరు(క్రైమ్): ముడి బంగారంతో ఐదుగురు వర్కర్లు ఉడాయించిన ఘటనపై నెల్లూరు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ఖుద్దూస్ నగర్‌కు చెందిన ఖలీల్ అహ్మద్ గిడ్డంగివీధిలో బంగారు ఆభరణాల తయారీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. వ్యాపారుల నుంచి ఆర్డర్లు తీసుకుని కమీషన్ పద్ధతిపై ఆభరణాలు తయారీ చేసి ఇస్తుంటాడు. అతడి వద్ద పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్ నిజామ్ రెండేళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన సహరన్, మౌనిరుల్, ఇదరేష్, సఫీక్, బిశ్వనాథ్ ఢాకేలు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఖలీల్ అహ్మద్ వద్ద పనిలో చేరి నమ్మకంగా ఉండసాగారు. సెప్టెంబర్ 4వ తేదీన ఖలీల్ అహ్మద్ బంగారు ఆభరణాల తయారీ నిమిత్తం సహరన్, మౌనిరుల్, ఇదరేష్‌కు 40 గ్రాములు, సఫీక్‌కు 137 గ్రాముల ముడి బంగారాన్ని ఇచ్చాడు. మేనేజర్ ద్వారా కొంత బంగారాన్ని బిశ్వనాథ్‌కు ఇచ్చాడు. వర్కర్లందరూ కలిసి ఆభరణాలు తయారు చేయకుండా అదే నెల 19వ తేదీన బంగారంతో ఉడాయించారు. బాధితుడు వారికోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. ఈ మేరకు బాధిత యజమాని గురువారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment