మా ముందే మైకులో మాట్లాడతారా..?
నెల్లూరు(క్రైమ్): తమ ప్రాంతం నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు కోరడమే తప్పనే రీతిలో పోలీసులు చెలరేగిపోతున్నారు. వాకర్స్ రోడ్డులో జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన వైన్ షాపును తొలగించాలంటూ ఆ ప్రాంత వాసులు 15 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనను వారు గురువారం తీవ్రం చేశారు. మద్యం దుకాణంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోందని మైకులో స్థానిక మహిళలు మాట్లాడసాగారు. ఈ తరుణంలో మైకును లాక్కునేందుకు చిన్నబజార్ పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులు.. స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఖాకీల తీరును నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. వైన్ షాపును తొలగించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని వారు తేల్చిచెప్పారు. కాగా మైకును లాక్కునేందుకు యత్నించిన ఘటనపై పోలీసులను సంప్రదించగా, దాని వినియోగానికి అనుమతి లేదని, ఇలా వ్యవహరించడం తగదని సూచించామని బదులిచ్చారు.
లాక్కునేందుకు పోలీసుల యత్నం
మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరడమే తప్పా..?
ఖాకీల తీరుపై స్థానికుల అసహనం
Comments
Please login to add a commentAdd a comment