నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ టీ20 లీగ్ కమ్ నాకౌట్ పోటీలకు ఎంట్రీలు పంపాలని కార్యదర్శి డి.నిఖిలేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే జట్లు తమ సభ్యుల వివరాలను డిసెంబర్ 6వ తేదీలోపు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలోని క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రవేశరుసుము రూ.5,000 చెల్లించాలన్నారు. క్రీడాకారులు ఉమ్మడి జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. వేరే జిల్లాల నుంచి వచ్చి నెల్లూరులో చదువుకునే వారు తమ విద్యాసంస్థల గుర్తింపుకార్డులతో జట్టులో ఉండొచ్చన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్లు 94405 36270 (నెల్లూరు), 99852 33061 (గూడూరు), 96527 45899 (కావలి), 99597 22799 (వెంకటగిరి)ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment