ఇలా ఉంటే తిరిగేదెలా..!
స్టోన్‌హౌస్‌పేట మెయిన్ రోడ్డులో వాహనాల రద్దీ
నడిరోడ్డుపైనే లోడింగ్, అన్‌లోడింగ్
నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటకు జిల్లాలోనే ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. ఇక్కడి నుంచే చాలావరకూ నిత్యావసరాలు, ఇతర వస్తువులు పల్లెలకు వెళ్తుంటాయి. అయితే ఇరుకురోడ్లు.. ఆపై చొచ్చుకొచ్చిన ఆక్రమణలు.. నడిరోడ్లపైనే వస్తువులు లోడింగ్, అన్‌లోడింగ్.. అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ కారణంగా నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధి, రేబాలవారివీధి తదితర ప్రాంతాల్లో దుకాణాలు విస్తరించి ఉన్నాయి. వీటికి జిల్లా నలుమూలల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. అయితే దుకాణాలకు సరైన
పార్కింగ్ లేదు. వాహనదారులు రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సామగ్రిని తీసుకొచ్చే భారీ వాహనాలు నిర్దేశిత సమయాల్లోనే లోడింగ్, అన్‌లోడింగ్ చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో ముఖ్యమైన వంతెనలు మూడు ఉండగా ఒకదానిని ఆటో స్టాండ్‌గా మార్చేశారు. ఇంకా షాపుల వద్ద రోడ్లపైనే ఆటోలను గంటల తరబడి ఆపేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
– నెల్లూరు(క్రైమ్)
Comments
Please login to add a commentAdd a comment