పొట్టకూటి కోసం వచ్చి..
● పోలీస్ జీపు ఢీకొని
బెంగాల్ వాసి మృతి
బుచ్చిరెడ్డిపాళెం: పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వలస కూలీ పోలీస్ జీపు ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాళెం సమీపంలోని రేబాల వద్దనున్న పెట్రోలు బంకు ఎదురుగా మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ మండల్ (40), మరికొందరు బుచ్చిరెడ్డిపాళెం పరిసర ప్రాంతాల్లో వరినాట్లు వేసేందుకు వచ్చారు. మరో రెండు రోజుల్లో వారు పనులు పూర్తి చేసి సొంతూరికి బయలుదేరాల్సి ఉంది. కాగా మంగళవారం రాత్రి పెట్రోల్ బంకు సమీపంలో విశ్వజిత్ రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో బుచ్చిరెడ్డిపాళెం సీఐ శ్రీనివాసరెడ్డి నెల్లూరుకు జీపులో బయలుదేరారు. ఈ వాహనం విశ్వజిత్‌ను ఢీకొంది. అతడిని వెంటనే సీఐ, కానిస్టేబుళ్లు అదే వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బెంగాల్‌కు చెందిన ఉత్తమ మండల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వజిత్ మృతదేహానికి బుధవారం డాక్టర్లు పోస్టుమార్టం చేయగా బెంగాల్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment