● పట్టుకోవడానికి
ప్రయత్నించిన ఎంవీఐ
ఉలవపాడు: మండలంలోని రాజుపాళెం – ఉలవపాడు మధ్యలో బుధవారం నకిలీ ఆర్టీఓ హల్చల్ చేశాడు. సుబ్బరాయుడు సత్రం నుంచి కందుకూరు మండలం కోవూరుకు మామిడి కాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను నకిలీ ఆర్టీఓ, మరో వ్యక్తి కారులో వచ్చి ఆపారు. వాహనంలో నుంచి దిగకుండా ట్రాక్టర్ డ్రైవర్ శింగరాయకొండకు చెందిన కుమ్మరి బాలకృష్ణను పిలిచి లోడ్ అధికంగా ఉందని రూ.15 వేలు ఫైన్ కట్టాలని భయపెట్టారు. కారు ముందు భాగంలో ఆర్టీఓ అని రాసి ఉంది. డ్రైవర్ ఆందోళన చెంది తన వద్ద అంత మొత్తం లేదని చెప్పగా నకిలీ అధికారి రూ.3 వేలను ఆన్లైన్ ద్వారా వేయించుకున్నాడు. ఈ సమయంలో అదేరూట్లో కందుకూరు ఎంవీఐ రాంబాబు తన వాహనంలో వెళ్తూ గమనించి నకిలీ ఆర్టీఓ వాహనాన్ని వెంబడించడానికి ప్రయత్నించగా వారు కారును వేగంగా నడుపుతూ పరారయ్యారు. ఎంవీఐ డ్రైవర్ వద్ద వివరాలు సేకరించారు. మోసపోయానని గుర్తించిన బాలకృష్ణ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై అంకమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment