గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
కావలి: విశాఖపట్నం నుంచి బెంగళూరుకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కావలి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి, 10.045 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కావలి డీఎస్పీ పి.శ్రీధర్ చెప్పారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో రాజు అనే వ్యక్తి వద్ద బెంగళూరుకు చెందిన వేలు 10.045 కేజీల గంజాయిని కొనుగోలు చేసి, వాటిని ఆరు ప్యాకెట్లలో ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకుని లారీలో బయలుదేరాడు. కావలి సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద లారీ దిగి, మరో లారీ ఎక్కడానికి రాజు ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకుని విచారించడంతో గంజాయి విషయం బయటపడింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. రాజును అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment