రుణాల మంజూరు లక్ష్యాలను చేరకపోతే చర్యలు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాలు మంజూరు చేయాలి. లక్ష్యాలను చేరుకోని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ శాఖ సీసీఆర్‌సీ కార్డ్ హోల్డర్ల జాబితాను సిద్ధం చేసి, కౌలు రైతులతో నేరుగా సంబంధిత బ్యాంకులకు అనుసంధానం చేయాలి. బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇచ్చే వరకు సరైన పర్యవేక్షణ తీసుకోవాలి. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు కూడా చురుకుగా వ్యవహరించాలి. కారణం లేకుండా రుణాలు తిరస్కరణ చేసిన బ్యాంకులపై చర్యలు ఉంటాయి. క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద క్లస్టర్లలో గుర్తించిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి.
– ఆనంద్, కలెక్టర్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment