పాషాణజలం | - | Sakshi
Sakshi News home page

పాషాణజలం

Published Mon, Jan 6 2025 7:31 AM | Last Updated on Mon, Jan 6 2025 7:31 AM

పాషాణ

పాషాణజలం

ఉదాహరణలు ఇవిగో..

ధనార్జనే ధ్యేయంగా రొయ్యల శుద్ధి పరిశ్రమలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. పరిసరాల వాతావరణాన్నే కాకుండా భూగర్భ, పంట కాలువల్లోని జలాలను కాలుష్య కోరల్లో ముంచెత్తున్నాయి. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటు సమయంలోనే నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తూ.. కలుషిత జలాల శుద్ధి వంటి వసతులు ఏర్పాటు చేశారా? చేశాక నిర్వహిస్తున్నారా? అనే విషయాలను పరిశీలించి అనుమతులు ఇవ్వడం, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖాధికారులు అవినీతిలో మునిగి తేలుతూ.. మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. ఈ పరిశ్రమలకు చుట్టు పక్కల జల, వాయు కాలుష్యంతో మనుషులతోపాటు పశువులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నాయి.

జిల్లాలో ఉన్న రొయ్యల

ప్రాసెస్‌ యూనిట్లు

1. స్టార్‌ ఆగ్రో మైరెన్‌ ఎక్స్‌పోర్ట్‌,

ఇందుకూరుపేట మండలం

2. పైవ్‌ స్టార్‌ మైరెన్‌ ఎక్స్‌పోర్ట్‌,

నారాయణరెడ్డిపేట, నెల్లూరు రూరల్‌

3. బీఎంఆర్‌ ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,

దామవరం, దగదర్తి మండలం

4. వాటర్‌ బేస్‌ లిమిటెడ్‌, అనంతపురం,

టీపీగూడూరు మండలం

5. సాయి మైరెన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,

నారాయణరెడ్డిపేట నెల్లూరు రూరల్‌

6. శరత్‌ ఇండస్ట్రియల్‌ లిమిటెడ్‌,

టీడీగూడూరు మండలం

7. అల్ఫా మైరెన్‌ లిమిటెడ్‌ గండవరం, కొడవలూరు మండలం

8. గ్రీన్‌ హౌస్‌ ఆగ్రో ప్రొడెక్ట్‌,

కొడవలూరు మండలం

9. ఆంజనేయ సీఫుడ్స్‌ కొడవలూరు మండలం

10. ఫెడోరా సీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,

కొడవలూరు మండలం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని రొయ్యల శుద్ధి పరిశ్రమలు జీవరాసుల మనుగడకు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. రొయ్యల ప్రాసెసింగ్‌ కోసం వినియోగించే ప్రమాదకర రసాయనాలతో కూడిన కలుషిత వ్యర్థ జలాలను నేరుగా సాగునీటి కాలువల్లోకి, ఆరు బయట ఖాళీ ప్రదేశాల్లోకి వదిలేస్తున్నారు. దీంతో సారవంతమైన సాగు భూములు నిర్జీవంగా మారిపోతున్నాయి. భూగర్భ జలాలు విషపూరితమై ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి. కొన్నేళ్లుగా రొయ్యల ప్రాసెస్‌ యూనిట్లలో జరిగే ఈ దుర్మార్గమైన వ్యవహారాన్ని అటు పరిశ్రమలు యజమాన్యాలు, ఇటు మత్స్యశాఖాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెలుగులోకి రానివ్వడం లేదు. స్థానికంగా రైతులు, ప్రజలు గగ్గొలు పెడుతున్నా.. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ కళ్లకు గంతలు కట్టుకున్నారు.

సీడ్‌ నుంచి ఫీడ్‌.. ప్రాసెసింగ్‌ వరకు ఇక్కడే..

జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం దాదాపు 33,128 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఆక్వా రంగానికి సంబంధించి సీడ్‌ నుంచి ఫీడ్‌ పరిశ్రమలతోపాటు రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. మూడు ఫీడ్‌ ప్లాంట్లతోపాటు పది వరకు రొయ్యల ప్రాసెస్‌ యూనిట్లు, 61 సీడ్‌ హేచరీలు ఉండగా అందులో 22 సీడ్‌ హేచరీలే రన్నింగ్‌లో ఉన్నాయి. ఆయా ప్రాసెస్‌ యూనిట్లు, హేచరీల్లో అడుగడుగునా నిబంధన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. చాలా వరకు పీసీబీ ప్రమాణాలు పాటించడం లేదు. యూనిట్ల నుంచి వచ్చే రసాయనాలు కలిసిన వ్యర్థాలు పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. దీంతో భూములు నిర్జీవంగా మారి, చౌడు బారి బీడ్లుగా మారిపోతున్నాయి. పైర్లు ఎదుగుదల క్షిణించిపోతుంది. ఆ ప్రాంతంలో ఆ నీరు భూగర్భంలోకి ఇంకిపోవడంతో తాగునీరులో కూడా విషం నిండి ఉండడంతో ఎన్నో వ్యాధులు ప్రబలి మనుషుల ప్రాణాలకే హాని కలిగిస్తోంది.

హరిస్తున్న పశువుల ప్రాణాలు

రొయ్యల శుద్ధికి సోడియం, క్లోరైడ్‌, అమ్మెనియా వంటి ప్రమాదకర రసాయనాలు వాడుతారు. ఈ వ్యర్థ జలాలను నేరుగా కాలువల్లోకి వదిలేయడంతో ఆ నీటిని తాగడం వల్ల పశువులకు స్థానిక ప్రజలకు ప్రాణ సంకటంలా మారుతోంది. గత పదేళ్లలో వివిధ రకాల వ్యాధులతో రెండు వేల వరకు పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వెటన్నరీ వైద్యుల శాంపిల్స్‌ ల్యాబ్‌లో పరీక్షిస్తే కలుషిత నీటితో వచ్చే వ్యాధులు సోకినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

తినే ఆహారం విషమే

రసాయనాలు కలిసిన సాగునీటి వల్ల ఈ ప్రాంతంలో సారవంతమైన పోలాలు లవణ (ఉప్పు) శాతం పెరిగి చౌడు బారాయి. భూముల్లోని ఐదు పొరల్లో చౌడు బారి పంటల ఎదుగుదల నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. కలుషిత నీటితో పండిన పంట ఉత్పత్తులు తినడం వల్ల జీర్ణకోశ వ్యాధులు, అతిసారా, గ్యాస్ట్రో, కేన్సర్‌ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.

శుద్ధి ప్రక్రియ ఇలా..

సాగునీటి కాలువల్లోకి రొయ్యల

ప్రాసెసింగ్‌ యూనిట్ల వ్యర్థాలు

భూగర్భ జలాలే కాక..

నీటి దొరువులు జల కాలుష్యం

వీటి సమీపంలోని 20 వేల

ఎకరాల సాగు భూములు నిర్జీవం

కలుషిత నీరు తాగి వేలాది

పశువుల మృతి

తాగునీటితో జీర్ణకోశ, కేన్సర్‌ వ్యాధులు

టీపీగూడూరు మండలంలో ఉన్న ఓ రొయ్యల ప్రాసెస్‌ యూనిట్‌ నుంచి రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను ఈదూరు, కోడూరు జాయింట్‌ చెరువు నుంచి వెళ్లే పంట కాలువలోక్లి వదిలేస్తున్నారు. ఆ కాలువ కింద దాదాపు 5 వేల ఎకరాలకు పైగా సాగవుతోంది. రసాయనాలు కలిసిన నీరు పంట పొలాల్లోకి చేరడంతో పంట భూములు నిర్జీవంగా మారుతున్నాయి. వెంకన్నపాళెంలో ఉన్న సీడ్‌ ప్లాంట్‌ నుంచి వచ్చే రసాయనాల నీరు బకింగ్‌హోం కెనాల్‌లోకి వదిలేస్తున్నారు.

కోడూరు బీచ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హేచరీలు ల నుంచి వ్యర్థ జలాలు బకింగ్‌హాం కెనాల్‌లోకి వదిలేస్తున్నారు. రసాయనాలు కలిసిన వ్యర్థ జలాలు కాలువలో కలిసి పోవడంతో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది. ఆ చేపలను తింటే పలు రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొడవలూరులో మూడు ప్రాసెసింగ్‌ యూనిట్లు పంట పొలాల మధ్య ఏర్పాటు చేశారు. వీటి నుంచి విడుదల చేసే వ్యర్థ జలాలు మలిదేవి డ్రైయిన్‌లో వదిలేస్తున్నారు, ఆ డ్రైయిన్‌ పరిధిలో ఆల్లూరుపాడు, మోడేగుంట, మానేగుంటపాడు గ్రామాల పరిధిలోని దాదాపు 300 ఎకరాలు ఆయకట్టులో పంటలు సాగువుతున్నాయి. రసాయనాలు కలిసిన జలాలు డ్రైయిన్‌లో కలవడం వల్ల ఆ నీరు పారే భూములు చౌడు తేలి పంటల ఎదుగుదల క్షిణించిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

గండవరం వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రాసెస్‌ యూనిట్‌ నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలు పైడేరులోకి వదిలేస్తున్నారు.. ఆ పైడేరు కింద అల్లూరు మండలంలోని నార్తుమోపూరు, ఆములూరు గ్రామాలకు చెందిన 800 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది.

రొయ్యల శుద్ధి కేంద్రాల్లో రియల్‌ టైం పొల్యూషన్‌ తెలిపే ఆర్‌టీపీఎంస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సూయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను అందులోకి పంపిచాలి. కానీ ఆ ప్లాంట్‌ ఏర్పాటు ఖర్చుతో కూడుకుంది కావడంతో ప్లాంట్‌ యజమానులు నేరుగా బయట పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. వాస్తవంగా రొయ్యల శుద్ధిలో ఏడు రకాల రసాయనాలు వాడుతారు పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన వ్యర్థాలను డిస్పోజ్‌ కంపెనీకి అప్పగించాలి. అయితే అందుకు విరుద్ధంగా వాటిని అక్కడిక్కడే బయట రోడ్ల పక్కనే పారబోస్తున్నారు.

పంటలు నాశనం అయిపోతున్నాయి..

నార్తురాజుపాళెంలోని రెండు, కోవూరులోని ఒక రొయ్యల ప్రాసెస్‌ ఫ్యాక్టరీల్లోని వ్యర్థ నీటిని మలిదేవిలోకి పైప్‌లైన్ల ద్వారా వదిలేస్తున్నారు. ఈ నీటినే రామన్నపాళెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు, మోడేగుంట రైతులు వరి సాగుకు ఉపయోగిస్తుండడంతో పంటలు నాశనమవుతున్నాయి. కలుషిత నీరైనందున పంట ఆరోగ్యకరంగా పెరిగేందుకు ఈ కలుషిత నీరు ఇబ్బందికరంగా మారుతున్నాయి. – కారంపూడి సుబ్బరామిరెడ్డి, రైతు,

మానేగుంటపాడు, కొడవలూరు మండలం

మా భూములు చౌడుబారుతున్నాయి

రొయ్యలు శుద్ధి చేసిన నీరు పంట కాలువల్లోకి వదిలేస్తుండడంతో భూములు చౌడు బారి పోతున్నాయి. పంటలు ఎదుగుదల ఉండడం లేదు. భూమి పొరల్లో చౌడులా మారి పోతున్నాయి. ఏదైనా ఉద్యాన పంటలు వేసుకుందామన్నా.. పంట ఎదుగుదల లేదు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

– ఊటుకూరు శ్రీనివాసులు, రైతు, కోడూరు

ప్రతి హేచరీని, ప్రాసెస్‌ యూనిట్లలో తనిఖీలు చేస్తాం

రొయ్యల ప్రాసెస్‌ యూనిట్లు, సీడ్‌ తయారీ హేచరీస్‌ల నుంచి వచ్చే వ్యర్థజలాలు పంట కాలువల్లోకి వదిలివేయకూడదు. స్థానికంగా స్లూయిజ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుని ఆ కలుషిత జలాలను శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు. పంట కాలువల్లోకి వదిలివేయడం చట్ట ప్రకారం నేరం. త్వరలోనే అన్ని ప్లాంట్లు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం.

– నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ నెల్లూరు

No comments yet. Be the first to comment!
Add a comment
పాషాణజలం1
1/5

పాషాణజలం

పాషాణజలం2
2/5

పాషాణజలం

పాషాణజలం3
3/5

పాషాణజలం

పాషాణజలం4
4/5

పాషాణజలం

పాషాణజలం5
5/5

పాషాణజలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement