ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన తప్పనిసరి
నెల్లూరు(క్రైమ్): ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా యువజన అధికారి ఎ.మహేంద్రరెడ్డి సూచించారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎన్‌సీసీ క్యాడెట్లు, కృష్ణచైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులు నెల్లూరు వీఆర్సీ సెంటర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాల శాతాన్ని తగ్గించవచ్చన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీటు బెల్టు విధిగా ధరించాలన్నారు. మైనర్ డ్రైవింగ్ నేరమన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్‌శంకర్, బి.సతీష్‌కుమార్, కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment