రూ.100కి చేరువైన వంకాయల ధర
● మునక్కాయ ఒకటి రూ.20
నెల్లూరు(సెంట్రల్): భోజనంలో వంకా య కూర అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ ప్రస్తుతం వంకాయలు కొని వండుదామంటే ధరలు మండిపోతున్నాయి. మార్కెట్‌లో వంకాయల ధర కిలో రూ.100కి చేరువైంది. నెల్లూరులోని హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్‌లోనే వ్యాపారులు కిలో రూ.80 నుంచి రూ.90కి అమ్ముతున్నారు. రిటైల్‌గా ఆమ్మేవారు రూ.100కి విక్రయాలు చేస్తున్నారు. దీనికి తోడు మునక్కాయలు గతంలో పదికి రెండు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఒక మునక్కాయ ధర రూ.20కి చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకెంత పెరుగుతాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment