ప్రతినెలా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివస్
నెల్లూరు రూరల్: ప్రతి నెలా మూడో శనివారం జిల్లా అంతటా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛత దివస్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాలలో ప్రజ లు ఎక్కువగా భాగస్వాములు అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వీధులను, డ్రైనేజీలను తాగునీటి వనరులను, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను శుభ్రపరచాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వ్యాధులు రాకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.
దివ్యాంగులకు
రాయితీపై పెట్రోల్
నెల్లూరు రూరల్: మూడు చక్రాల వాహనాలు కలిగిన దివ్యాంగులు రాయితీపై పెట్రోల్ పొందేందుకు వనంతోపులోని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు మహమ్మద్ అయూబ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయ ఫోన్ నం.0861–2329581ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment