కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో ప్రజాప్రయ
కబ్జా చేసిన స్థలంలో మట్టిని చదును చేస్తున్న పొక్లయిన్
రూ.7.5 కోట్ల విలువైన స్థలాన్ని కాజేసి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో స్థలాల దురాక్రమణపై ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నగరంలోని ఖరీదైన భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలున్నాయో వెతికి మరీ ఆక్రమణ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని నెల్లూరు బిట్–1 గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 140, 141లో ఒకటిన్నర దశాబ్దాల క్రితం లేఅవుట్ వేశారు. మొత్తం విస్తీర్ణం 7.42 ఎకరాల్లో 250 అంకణాల స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం రిజర్వు చేశారు. ఆ స్థలం కార్పొరేషన్ ఖాతాలో కలిసి పోయి ప్రభుత్వ భూమిగా మారింది. కానీ టీడీపీ నేతలు సదరు స్థలంపై కన్నేశా రు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూమి విలువ బాగా పెరిగింది. అంకణం విలువ రూ.3 లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఆ స్థలం విలు వ రూ.7.5 కోట్లుగా ఉంటుంది. అంతటి ఖరీదైన స్థలాన్ని టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించారు.
కమిషనర్‌కు ఫిర్యాదు
కార్పొరేషన్‌కు సంబంధించిన విలువైన స్థలాన్ని ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయడంపై స్థానికులు కమిషనర్ సూర్యతేజ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి జిల్లా రిజిస్ట్రార్‌కు వెంటనే ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేయమని ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రేషన్లు రద్దు చేయడమే కాకుండా వాటిని ఎవరు ఎవరికి ఎలా చేశారో నివేదిక ఇవ్వాలని ఆదేశాలివ్వడం నగరంలో చర్చనీయాంశమైంది.
రిజిస్ట్రేషన్ అధికారులపై ఒత్తిళ్లు
కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్న అధికార పార్టీ నేతలు.. చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయకుండా ఆ శాఖ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారు. గత ఇరవై రోజులుగా ఈ వ్యవహారంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలతో సతమతమవుతున్నారు. రిజిస్ట్రేషన్లను రద్దు చేయడమే కాకుండా ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచుతామని రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు.
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి..
రిజిస్ట్రేషన్లు చేయించిన టీడీపీ నేతలు
వాటిని రద్దు చేయాలని
కమిషనర్ ఆదేశాలు
మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment