పక్కాగా ఎల్సీడీసీ సర్వే
● అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఖాదర్‌వలీ
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈనెల 20 నుంచి చేపడుతున్న ఎల్సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) సర్వేను క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పక్కాగా నిర్వహించాలని అడిషనల్ డీఎంహెచ్‌ఓ, జిల్లా లెప్రసీ నియంత్రణాధికారి డాక్టర్ ఖాదర్‌వలీ సూచించారు. శుక్రవారం స్థానిక కోటమిట్ట అర్బన్ హెల్త్ సెంటర్, మల్లికార్జునపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు నగరంలోని చాకలివీధిలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖాదర్‌వలీ మాట్లాడుతూ లెప్రసీని అరికట్టడమేఽ ధ్యేయంగా వైద్యశాఖ సిబ్బంది పని చేయాలని కోరారు. ప్రజలు కూడా ఎలాంటి చర్మ సమస్యలున్నా వాటి గురించి వైద్యశాఖ సిబ్బందికి తెలిపి సహకరించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ గీతాంజలి, డాక్టర్ ప్రతిమ, డాక్టర్ నవీన్, డాక్టర్ నాగేంద్రబాబు, కమ్యూనిటీ ఆర్గనైజర్ తిరుపతయ్యలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment