ఒక యూనిట్లోనే విద్యుదుత్పత్తి
ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో ఉన్న శ్రీదామోదరం సంజీవయ్య ఏపీ జెన్‌కో ప్రాజెక్ట్‌లో ఒక్క యూనిట్ నుంచి మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇంజినీర్లు శుక్రవారం తెలిపారు. మూడో యూనిట్లో 560 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. బాయిలర్‌లో సాంకేతిక లోపం వల్ల ఒకటో యూనిట్లో, ఓవర్ ఆయిలింగ్ కారణంగా రెండో యూనిట్లో ఉత్పత్తి నిలిపివేసినట్టు వెల్లడించారు.
నుడా కార్యదర్శిగా
పెంచలరెడ్డి
నెల్లూరు(అర్బన్): నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) కార్యదర్శిగా రెవెన్యూ శాఖలో ప్రత్యేక డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న అల్లంపాటి పెంచలరెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన శుక్రవారం నుడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలుగుగంగ భూసేకరణ విభాగంలో పనిచేస్తూ నుడాకు బదిలీ అయ్యారు. ఆయన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నేడు నవోదయ
ప్రవేశపరీక్ష
మర్రిపాడు: మండలంలోని కృష్ణాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. ఆరోతరగతిలో 80 సీట్లు ఉండగా, 5,159 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంతం వారికి 25 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. మొత్తం సీట్లలో 33 శాతం సీట్లు బాలికలకు ఇస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకే విద్యార్థులకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 11 గంటల వరకు అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
మహిళల
ఆర్థికాభివృద్ధికి చర్యలు
● డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి
నెల్లూరు (పొగతోట): జిల్లాలోని పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధిని పెంపొందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి అన్నారు. శుక్రవారం డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి వివిధ మండలాల ఎంపీడీఓలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో పీడీ మాట్లాడారు. పొదుపు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించామన్నారు. మహిళలు తయారు చేస్తున్న వస్తువులకు మార్కెటింగ్ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. దీనికి సంబంధించి ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment