తీరంలో తాబేళ్ల మరణ మృదంగం
ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు సముద్రపు తాబేళ్లు దోహదపడతాయి. అయితే అవి ఇటీవల చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. తుమ్మలపెంట బీచ్‌లో కొన్ని తాబేళ్లు ఒడ్డున మరణించి ఉండటం అందర్నీ కలిచి వేసింది. ఈ మరణాలకు అనేక కారణాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. – కావలి
● తుఫాన్లు, అలలు లేదా సముద్రంలో ఏర్పడిన అసహజ పరిస్థితుల వల్ల తాబేళ్లు తీరానికి కొట్టుకొచ్చి తిరిగి వెళ్లలేకపోవడంతో చనిపోవచ్చు.
● ఆహార కొరతతో తాబేళ్లు బలహీనమై చనిపోవచ్చు.
● సముద్రంలో ప్లాస్టిక్, రసాయనాలు వంటి కాలుష్యం తాబేళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసి మరణానికి కారణమై ఉండవచ్చు.
● విషపూరిత రసాయనాలు (పరిశ్రమల నుంచి వచ్చేవి) సముద్రపు నీటిలో కలవడం వల్ల కావొచ్చు.
● చేపలు పట్టే వలల్లో ఇరుక్కుని తాబేళ్లు చనిపోతూ ఉండొచ్చు.
ప్రజలను చైతన్యపరచాలి
సముద్ర జీవశాస్త్రవేత్తలు, వన్యప్రాణి సంరక్షణ శాఖ, స్వచ్ఛంద సంస్థలు సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను చైతన్య పరచాలి. సముద్రంలోకి వ్యర్థాలు వెళ్లకుండా చూసు కోవాలి. తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం. వాటిని రక్షించి సముద్రంలోకి వద లాలి. అంతరించిపోతున్న సముద్ర జీవులను రక్షించడానికి, సముద్ర పర్యావరణాన్ని కాపాడటానికి ప్రణాళికలు రూపొందించాలి.
ఇలా జరిగి ఉండవచ్చు
కాపాడుకోవడం అందరి బాధ్యత
తుమ్మలపెంట బీచ్‌లో నిస్సహాయ స్థితిలో తాబేళ్లు మరణించడంపై కావలిలోని కలయిక విజ్ఞాన కేంద్రం కన్వీనర్లు జి.రాంప్రసాద్, ఇలింద్ర లావణ్య, సలహాదారు సి.శారదలు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశా రు. సంతానోత్పత్తి కోసం ఉభయచరాల్లో భాగమైన తాబేళ్లు సముద్రతీరానికి రావడం ప్రకృతి సహజం. వాటిని కాపాడుకోవడం ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment