పూలహారం @ రూ.70,300
రొళ్ల: ఇప్పటివరకూ మనం వినాయకుడి లడ్డూ వేలం చూసి ఉంటాం. రూ.లక్షలు పలికిన వాటి గురించి తెలుసుకుని ఉంటాం. రొళ్ల మండలం జీరిగేపల్లిలో మాత్రం వినాయకుడి మెడలోని పూలహారం వేలం వేస్తారు. ఏటా జరిగే కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పోటీపడతారు. ఈ సారి గ్రామానికి చెందిన ముడుపన్న అనే వ్యక్తి ఏకంగా రూ.70,300కు వేలంపాటలో స్వామివారి పూల హారాన్ని దక్కించుకున్నారు.
బంతిపూల మాలకు భారీ రేటు
జీరిగేపల్లి గ్రామంలో ఏటా స్వామివారికి చవితి రోజున బంతిపూలతో చేసిన మాల వేస్తారు. మూడోరోజు నిమజ్జనం సందర్భంగా ఆ హారాన్ని వేలం వేస్తారు. ఆ వచ్చిన డబ్బును మరుసటి సంవత్సరం స్వామివారిని కొలువుదీర్చేందుకు ఉపయోగిస్తారు. స్వామివారి పూలహారం దక్కించుకున్న వారికి మంచి జరుగుతుంది అని గ్రామస్తులు విశ్వాసం. అందుకే మామూలు బంతిపూల హారం కూడా వేల రూపాయలు పలుకుతుంది. ఈసారి ఏకంగా రూ.70,300కు ముడుపన్న దక్కించుకుని సంబరపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment