తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ 20 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని రొద్దం మండలంలో 66.2 మి.మీటర్లు, అమరాపురంలో 65.4 , రొళ్లలో 60.4, గుడిబండలో 41 , హిందూపురంలో 38.4, అమడగూరులో 32.7, చిలమత్తూరులో 32.4, సోమందేపల్లిలో 30.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే లేపాక్షిలో 24.6 మి.మీటర్లు, పరిగిలో 20.4, పెనుకొండలో 18.2, మడకశిరలో 15.2, నల్లమాడలో 7, రామగిరిలో 6.8, అగళిలో 6.6, కనగానపల్లిలో 5.2, కొత్తచెరువులో 5, ముదిగుబ్బలో 3.8, బత్తలపల్లిలో 2.2, పుట్టపర్తిలో 1.8 మి.మీటర్ల వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
20 మండలాల్లో కురిసిన వాన
రొద్దంలో అత్యధికంగా 66.2 మి.మీటర్లుగా నమోదు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వచ్చే మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ చేతన్ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 14, 15, 16 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment