అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సత్యసాయి సన్నిధిలో ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. విద్యావేత్త శ్రీనివాస్ దసరా పర్వదిన వేడుకలు, సత్యసాయి తత్వాలను భక్తులకు వివరించారు. అనంతరం సత్యసాయి విద్యాసంస్థల బృందావన్ క్యాంపస్‌కు చెందిన విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి అవతార వైభవాన్ని చాటుతూ ఆయన ప్రేమ తత్వాన్ని చాటుతూ వారు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మైమరపించింది. తర్వాత సత్యసాయి పూర్వపు ప్రసంగాలను వినిపించారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
నేడు మహా పూర్ణాహుతి..
దసరా వేడుకల్లో భాగంగా ఈ నెల 6న ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ వేద పురుష సప్తాహ జ్ఙాన యజ్ఞాన్ని ప్రారంభించారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రత్యేక యజ్ఞ వేదిక వద్ద 27 మంది రుత్వికుల బృందం యజ్ఞం చేపట్టింది. శనివారం ఉదయం 7 గంటలకు పూర్ణాహుతితో కార్యక్రమం ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment