వీఐపీల భద్రతలో పీఎస్‌ఓలే కీలకం
పుట్టపర్తి టౌన్: వీఐపీల భద్రతా విషయంలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు (పీఎస్‌ఓలు) ఎంతో కీలకమని ఎస్పీ రత్న అన్నారు. జిల్లాలోని వీఐపీల భద్రత విషయంలో విధులునిర్వర్తిస్తున్న పీఎస్‌ఓలకుజిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మూడు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. మారుతున్న టెక్నాలజీలో వీఐపీలకు భద్రత కల్పించడం పెను సవాళ్లతో కూడుకొని ఉంటుందన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ వీఐపీల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం పీఎస్‌ఓల విధివిధానలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.
‘పోలీసు స్పందన’కు 70 వినతులు..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి..
బాగా చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని పోలీస్ కుటుంబాల పిల్లలకు ఎస్పీ రత్న సూచించారు. గత విద్యాసంవత్సరంలో పది, ఇంటర్, డిగ్రీలో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన పోలీసు కుటుంబాల్లోని పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్, ప్రశంసాపత్రాలను సోమవారం ఆమె అందజేసి, అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులకు రూ.3,40,500 విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, ఏఓ సుజాత, సూపరింటెండెంట్ సరస్వతి, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం సభ్యుడు సూర్యకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రత్న
Comments
Please login to add a commentAdd a comment