రైతు గోడు పట్టదా?
రైతులను ఆదుకోండి
గత ప్రభుత్వ హయాంలో రైతుభరోసా కేంద్రం ద్వారా గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, తదితర వ్యవసాయ సేవలన్నీ అందుబాటులో ఉండేవి. మద్దతు ధర ప్రకటించి పంటలను సైతం కొనుగోలు చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేవారు. రైతుభరోసా పథకం కింద ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్నదాతా సుఖీభవ పథకం కింద రూ.20వేల సాయమందిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపశమనంగా ఉంటుంది. రైతులను ఆదుకోవాలి.
– రవీంద్రారెడ్డి, తేజప్ప, రైతులు, ఊటుకూరు
పరిగి: రైతుల గోడు కూటమి సర్కారుకు పట్టడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. పరిగి మండలం ఊటుకూరు పంచాయతీలో రైతులు సాగు చేసిన వరి, మిరప, కంది, మొక్కజొన్న పంటలను ఆమె సోమవారం పరిశీలించి, రైతుల సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఆర్బీకే ద్వారా పంట విత్తు నుంచి మద్దతు ధరతో కొనుగోలు దాకా వ్యవసాయ సేవలన్నింటినీ ముంగిటకే తీసుకొచ్చామని, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివి పక్కాగా అమలు చేసి రైతుపక్షపాతిగా నిలిచామని గుర్తు శారు. ప్రస్తుత కూటమి పాలన అందుకు విరుద్ధంగా ఉందన్నారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతుకు ఏడాదికి రూ.20వేల సాయం అందిస్తామన్న హామీని ఆరునెలలైనా అమలు చేయలేదన్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు బీమా కానీ, పంట నష్టపరిహారం కానీ అందించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. అరకొరగా పండిన పంట దిగుబడులను మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. రైతుల బాధలు, సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 13న ‘చలో కలెక్టరేట్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మంత్రులు ప్రచారార్భాటాలకే పరిమితం..
జిల్లాలో ఇద్దరు మంత్రులు సవిత, సత్యకుమార్ ఉన్నా ప్రచారార్భాటాలకే పరిమితమయ్యారని, రైతుల సంక్షేమాన్ని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని ఉషశ్రీచరణ్ విమర్శించారు.
ఆర్నెల్లు అవుతున్నా అందని
పెట్టుబడి సాయం
రైతు సమస్యలపై 13న చలో కలెక్టరేట్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment