టీకాలపై అపోహలు వీడాలి
పుట్టపర్తి అర్బన్: అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలపై ప్రజలు అపోహలు వీడి వైద్య బృందాలకు సహకరించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి కోరారు. సోమవారం స్థానిక సీ్త్ర శక్తి భవన్‌లో వ్యాధి నిరోధక టీకాలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలోని 62 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పర్యవేక్షణాధికారులు విచ్చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి వైద్యాధికారి, సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి నాగేంద్ర నాయక్, సర్వైలెన్స్ మెడికల్ ఆఫీసర్ వరుణ్, డాక్టర్ జ్యోత్స్న తదితరులు మాట్లాడారు. వ్యాధి నిరోధక టీకాలపై వచ్చిన అపోహలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ప్రజల్లో వచ్చే అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. హౌస్‌హోల్డ్ సర్వే, మైక్రో యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.
‘సంకల్ప్–2025’ను
విజయవంతం చేయండి
పుట్టపర్తి అర్బన్: ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెంపే లక్ష్యంగా ఈ ఏడాది అన్ని జూనియర్ కళాశాలల్లోనూ అమలు చేయనున్న ‘సంకల్ప్ –2025’ను విజయవంతం చేయాలని డీవైఈఓ రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొత్తచెరువు జూనియర్ కళాశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు పలు సూచలను చేశారు. విద్యార్థుల్లో ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ స్టడీ అవర్స్ నిర్వహించి, ఉత్తీర్ణత శాతం పెంచనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 22 కళాశాలల్లో ఫస్టియర్ 3,872 మంది, సెకండియర్‌లో 3,063 మంది చదువుతున్నారన్నారు.
గుడిబండ కొండలో
చిరుత సంచారం
గుడిబండ: మండల కేంద్రం గుడిబండలోని కొండలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సమీప గ్రామాల్లో మేకలు, గొర్రెలు, పశువులు తదితర మూగజీవులపై గత కొన్ని రోజులుగా చిరుత దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో గుడిబండకు చెందిన శ్రీరామప్ప ఇంటి ఆవరణలోని కుక్కపై చిరుత దాడి చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి వన్యప్రాణుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment