బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
ప్రశాంతి నిలయం: గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 232 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక అర్జీలు పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోడంతోపాటు పరిష్కరించిన తరువాత దరఖాస్తుదారుకు మెసేజ్ పంపాలన్నారు. అన్ని శాఖల విభాగాధిపతులు బయోమెట్రిక్ హాజరు పూర్తిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో విజయవాడలో జరిగే కలెక్టర్ల సమావేశం కోసం అన్ని శాఖలకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఎల్‌డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజూవాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రావు, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ వరలక్ష్మి, డీఈఓ క్రిష్టప్ప, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఆరోగ్యశ్రీ కో ఆర్టినేటర్ శ్రీదేవి, క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఉదయ భాస్కర్, ఆర్టీసీ జీఎం రవిచంద్ర, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
అడవుల పరిరక్షణకు కృషి చేయాలి
అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. జిల్లాలో అడవులకు నిప్పు పెట్టకుండా గొర్రెల కాపరులు, గ్రామీణులు, రైతులకు అవగాహన కల్గించేందుక అటవీశాఖ అధ్వర్యంలో చేపట్టనున్న సదస్సులకు సంబంధించి ‘అడవికి నిప్పు – మనిషికి ముప్పు’ పేరిట రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఆయన ఆవిష్కరించారు. డిసెంబర్ నుంచి మే నెల చివరి వరకు తరచుగా అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని, వీటిని అరికట్టేందుకు ప్రజా చైతన్యం అవసరమన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పుట్టపర్తి అర్డీఓ సువర్ణ, జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి, బుక్కపట్నం అటవీ క్షేత్ర అధికారి యామిని సరస్వతి, ఫారెస్ట్ సెక్షన్ అధికారి చంద్రానాయక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాహుల్, రమణారెడ్డి తదితరుల పాల్గొన్నారు.
సచివాలయ సిబ్బందికి కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment