వేరుశనగ చెక్క వేలం
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జిల్లా జైలులో బుధవారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ రహ్మాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25,000 కేజీల వేరుశనగ చెక్కకు వేలం పాట నిర్వహిస్తున్నామన్నారు. ప్రాంతీయ జైళ్ల ఉపశాఖ అధికారి కడప రేంజ్ వారి సమక్షంలో వేలం సాగుతుందన్నారు. ముందుగా రూ. 20,000 డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాట ముగిసిన తరువాత డిపాజిట్ వెనక్కి చెల్లిస్తామని పేర్కొన్నారు.
ముగిసిన బోరుగడ్డ అనిల్
పోలీస్ కస్టడీ
అనంతపురం: బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీస్ కస్టడీ ముగిసింది. టీడీపీ మహిళా అధికార ప్రతినిధి తేజస్విణి ఫిర్యాదు మేరకు అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అనిల్‌ను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోరారు. ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకు రాజమండ్రి జైలు నుంచి అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు పోలీసు కస్టడీ ముగిసింది. అనంతపురం అర్భన్ డీఎస్పీ వి. శ్రీనివాసరావు నేతృత్వంలో విచారణ చేశారు. ఆఫ్ ద రికార్డు మాట్లాడిన మాటలను యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం చేశారని బోరుగడ్డ అనిల్ విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. అనంతరం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment