యువకుడి దుర్మరణం
పావగడ: స్థానిక తుమకూరు రోడ్డులోని ఎస్‌ఆర్‌ఎస్ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ గిరీష్ (21) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం ఉదయం పావగడ వైపుగా పెయింట్ల డబ్బాలతో వస్తున్న బొలెరో వాహనం పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. వాహనంలోనే చిక్కుకుని డ్రైవర్ గిరీష్ దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఎదురుగా వస్తున్న ఒమినీ వాహనాన్ని తప్పించబోయి ఉన్నఫళంగా తన మార్చాన్ని మార్చుకోవడంతో ఆ వెనుకనే ఉన్న బొలెరో ఢీకొన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు మండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లికి కి చెందిన పుట్టస్వామి కుమారుడు గిరీష్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ సురేష్, ఎస్‌ఐ గురునాథ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
12న రగ్బీ సబ్ జూనియర్
జిల్లా స్థాయి పోటీలు
అనంతపురం: జిల్లా స్థాయి సబ్ జూనియర్ (అండర్–15 బాలికలు, బాలురు) రగ్బీ పోటీలు ఈ నెల 12న బత్తలపల్లిలోని ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, డైరెక్టర్ కె.రాజశేఖర్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2009, 2010, 2011 సంవత్సరాల్లో జన్మించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పూర్తి వివరాలకు 81066 74037, 97041 08321లో సంప్రదింవచ్చు.
ఒకే ఈతలో రెండు దూడలు
రాయదుర్గం: ఒకే ఈతలో రెండు దూడలకు ఆవు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం రాయదుర్గం మండలం 74 ఉడేగోళంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న దేశవాళీ ఆవు రెండు దూడలకు జన్మనివ్వడంపై రైతు వరకూటి హంపారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఒకటి పెయ్య దూడ అని తెలిపారు. రెండు దూడలూ ఆరోగ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లలు సహా తల్లి
అదృశ్యం
యాడికి: యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన తలారి జ్యోతి తన ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయింది. ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మంగళవారం రాత్రి జ్యోతి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment