మహిళ ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: జీవితంపై విరక్తితో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపిన మేరకు... మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకకు వచ్చిన ధర్మవరంలోని సిద్దయ్యగుట్టకు చెందిన లక్ష్మీదేవి(59) స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మొదటి మరువ సమీపంలో తేలుతున్న మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించారు. మృతురాలిని లక్ష్మీదేవిగా గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. మతి స్థిమితం లేని ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదంలో ఆర్‌ఎంపీ మృతి
రామగిరి: మండలంలోని పేరూరు సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ వన్నూరప్ప (36) మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... పెద్దకొండాపురం గ్రామానికి చెందిన చాకలి వన్నూరప్ప పేరూరులో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రథమ చికిత్స అందజేస్తుండేవాడు. కొన్నేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి తన వైద్య కేంద్రానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా పేరూరు సమీపంలోకి చేరుకోగానే ఫిట్స్ రావడంతో వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు గుర్తించి వెంటనే పీహెచ్‌సీకి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రామగిరి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా, వన్నూరప్పకు భార్య లక్ష్మీదేవి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య
గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(60) ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని నెలలుగా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఎవరూ లేని విష ద్రావకం తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై సోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment