కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ
డ్రోన్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు ముందుకొస్తే డ్రోన్‌ల వినియోగంపై శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం.
– కృష్ణమీనన్, ఏడీఏ, మడకశిర
ఆర్‌ఎస్‌కేల్లో అందుబాటులో ఉంచాలి
ఒక్క డ్రోన్ కొనుగోలు చేయాలంటే సామర్థ్యాన్ని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. దీంతో డ్రోన్‌లను కొనుగోలు చేయలేకపోతున్నాం. అద్దెకు తెస్తామనుకుంటే బాడుగల భారం భరించలేకున్నాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సబ్సిడీతో ఆర్బీకేలకు ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను అందించి రైతులను ఆదుకుంది. అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా ఒక్కో ఆర్‌ఎస్‌కేకు ఒక్కో డ్రోన్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. – నాగరాజు, రైతు, అగళి
Comments
Please login to add a commentAdd a comment