నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.62.36 లక్షలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ. 62.36 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ కే.వాణి తెలిపారు. మంగళవారం ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ 49 రోజులకు గానూ రూ. 62,36,139 నగదును భక్తులు స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. అలాగే, అన్నదానం హుండీ ద్వారా రూ.26,206 అందిందన్నారు. 7 గ్రాముల బంగారు, 1.630 కిలోల వెండి, కెనడా డాలర్లు 20, నేపాల్ రుపీస్ 205, సౌదీ అరేబియా రియాన్స్ 10 స్వామివారికి సమర్పించినట్లు పేర్కొన్నారు. గుంతకల్లు ఆర్టీసీ హనుమాన్ సేవాసమితి సభ్యులు, బళ్లారికి చెందిన వీరభద్రసేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment