ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
పుట్టపర్తి టౌన్: పట్టణంలోని పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు స్పోర్ట్స్‌మీట్ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతోంది. రెండోరోజైన గురువారం ధర్మవరం, కదిరి, హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ సబ్ డివిజన్లు, ఆర్మ్‌డ్ విభాగాలకు చెందిన క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. ఎస్పీ రత్న టెన్నికాయిట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, 100, 400 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.
వాలీబాల్ విజేతగా ధర్మవరం..
వాలీబాల్ పోటీల్లో ధర్మవరం సబ్ డివిజనల్, ఆల్ వింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ పోటీలో ధర్మవరం సబ్ డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. అలాగే కబడ్డీ ఫైనల్‌లో ధర్మవరం సబ్ డివిజన్‌తో తలపడిన జిల్లా ఆర్మ్ రిజర్వుడ్ జట్టు విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment