ఎన్‌పీకుంట: ఉమ్మడి వనరులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని సారగుండ్లపల్లి సమీపంలో పాపాగ్ని నది పరివాహక ప్రాంతంలో ఎఫ్‌ఈఎస్ సంస్థ ఆధ్వర్యంలో ‘పాపాగ్ని పిలుపు’ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌డీఏ పీడీ, ఏపీడీ, అటవీశాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె సంఘాల ద్వారా కొండల్లోని చెట్లను కొట్టకుండా కట్టుబాట్లను పెట్టుకొని ఉమ్మడి వనరుల పునరుద్ధరణకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నట్లు వివరించారు. రాబోయే పది సంవత్సరాలలో పాపాగ్ని పరివాహక ప్రాంతం పరిరక్షణకు చేపట్టవలసిన పనులపై చర్చించారు. డీఈఈ బయప్ప, డీఎఫ్‌ఆర్‌ఓ రామచంద్రనాయక్, డ్వామా ఏపీడీ రమేష్‌బాబు, సర్పంచ్ శీలంవెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment