ముగిసిన బ్రహ్మోత్సవాలు
మడకశిరరూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నిర్వహించిన వసంతోత్సవం, చక్రస్నానంతో ముగిశాయి. ఉదయం స్వామి వార్లను అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో వసంతోత్సవం నిర్వహించారు. అలాగే వివిధ గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున స్వామివార్లకు జ్యోతులను సమర్పించారు. వారం రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దేవదాయశాఖ అధికారులు, రథోత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
నేడు హుండీల లెక్కింపు..
భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment