విధుల్లో అలసత్వం సహించం
ప్రశాంతి నిలయం: జిల్లాలో మహిళా శిశు సంక్షేమశాఖ అన్ని అంశాల్లో పూర్తిగా వెనుకబడింది. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్ట్‌ల పనితీరు గురించి ఇన్‌చార్జ్ ఐసీడీఎస్ పీడీ సుధా వరలక్ష్మి, సీడీపీఓలతో అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు సకాలంలో సక్రమంగా పాలు, గుడ్లు, పంపిణీ జరిగేలా చూడాలన్నారు. మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇకపై ఐసీడీఎస్ పనితీరుపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, పనితీరులో తేడా వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
పరిశ్రమల స్థాపనకు చర్యలు..
నూతన పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ అమలు చేస్తున్న తరుణంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలశాఖ, ఏపీఐఐసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవాడల ఏర్పాటుకు తీసుకున్న చర్యలు, ప్రగతి అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలన్నారు. కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో అర్హులైన లబ్ధిదారుల పేర్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల స్థాపనకు ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపనకై భూ కేటాయింపులు చేపట్టవచ్చని, దీనికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోందన్నారు. పరిశ్రమల విస్తరణ అధికారి సంజీవ రాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సహానా సోనీ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు కలెక్టర్ చేతన్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment