వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి పుట్టపర్తి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పంచాయతీరాజ్ విభాగానికి సి.రాజారెడ్డి, గ్రీవెన్స్‌సెల్‌కు ఎస్ రమాకాంత్‌రెడ్డి. కల్చరల్ విభాగానికి వాల్మీకి బద్రీనాథ్‌ను నియమించారు. అలాగే విద్యార్థి విభాగానికి టి.పురుషోత్తం, మున్సిపల్ వింగ్‌కు గజ్జల శివ, ఆర్‌టీఐ వింగ్‌కు కె. రామాంజనేయులు, చేనేతలకు సంబంధించి జింకా కంబగిరిని నియమించారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మడకశిర మండలం జమ్మానిపల్లికి చెందిన నరసింహమూర్తి, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా ఎల్‌ఎన్ రంగప్పను నియమించారు. యూత్ విభాగం అధ్యక్షుడిగా కనగానపల్లి మండలానికి చెందిన మద్దెలచెరువు గంగుల సుధీర్‌రెడ్డి, వలంటీర్ విభాగానికి హరినాథరెడ్డి, సోషల్ మీడియా విభాగానికి బి.అభిలాష్‌ను ఎంపిక చేశారు. ఎస్టీ సెల్ విభాగానికి గోవింద్ నాయక్, క్రిస్టియన్ మైనార్టీ సెల్‌కు టి.వీరనారాయణ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా వి.ప్రసాద్‌రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడిగా వై.రామసుబ్బారెడ్డి, బీసీ సెల్‌కు ఎం.నారాయణ, వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడిగా జి.మల్లికార్జున, ఐటీ వింగ్‌కు డి.గంగిరెడ్డి, డాక్టర్స్ వింగ్‌కు ఎన్.రమేష్, ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా ఆర్.భాస్కర్‌రెడ్డిని నియమించారు. మహిళా విభాగానికి సి.నాగమణి, మైనార్టీ సెల్‌కు ఎన్.చంద్‌బాషా, వాణిజ్య విభాగానికి సీవీ మహేష్, బూత్ కమిటీల అధ్యక్షుడిగా వాల్మీకి లోకేష్‌లను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment